హీరోయిన్‌పై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్ - వివాదానికి ఆజ్యం (Video)

ఠాగూర్

సోమవారం, 13 జనవరి 2025 (09:30 IST)
హీరో రవితేజతో 'ధమాకా' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీని రూపొందించిన దర్శకుడు నక్కిన త్రినాథ రావు హీరోయి‌‍న్‌ను ఉద్దేశించి వల్గర్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ కాస్త సైజులు పెంచితే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఈ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సందీప్ కిషన్ హీరోగా నక్కిన మజాకా మూవీని రూపొందించారు. రీతూవర్మ హీరోయిన్. రావు రమేశ్, 'మన్మథుడు' ఫేమ్ అన్షులు కీలక పాత్రలను పోషించారు. వచ్చేనెల 21వ తేదీన సినిమా విడుదలకానుంది. 
 
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నక్కిన మాట్లాడుతూ, హీరోయిన్ అన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. 'మన్మథుడు' చిత్రం చూసినపుడు ఆమె లడ్డూలా ఉందని అనుకునేవారమని, ఆమెను చూసేందుకే సినిమాకు వెళ్లే వాళ్ళమని గుర్తు చేశారు. 
 
ఇపుడు తన సినిమాలో ఆమెను చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. చాలా సన్నబడి నాజూగ్గా ఉందని అంటూనే ఆమె బాడీషేప్స్‌పై వల్గర్ కామెంట్స్ చేశారు. ఇలా అయితే, తెలుగు ఆడియన్స్ చూడరని, కాబట్టి సైజులు కాస్త పెంచాలంటూ బాడీ షేప్స్‌పై సలహాలతో కూడిన కూమెంట్స్ చేశా. తాను ఇచ్చిన సలహాను ఆమె పాటించిందని కూడా చెప్పడంతో వేదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. 
 
కాగా, అంతకుముందు యాంకర్ గీతా భగత్‌తోనూ ఆయన అలాగే ప్రవర్తించారు. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఆమె షేక్ హ్యాడ్ ఇస్తే టచ్ బాగుంటుందని పండగ పూట బోణీ బాగుందని వెకిలి వ్యాఖ్యలు కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

హీరోయిన్లను ఉద్దేశిస్తూ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన వల్గర్ కామెంట్స్#TrinadhaRaoNakkina #Majaka #Tollywood #Tupaki pic.twitter.com/AHZ3GjheRa

— Tupaki (@tupaki_official) January 12, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు