'కయ్యాలే' వీడియో సాంగ్ ని బుధవారం సాయంత్రం విడుదల చేశారు. సిక్కిం లోని బుద్ధ పార్క్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ పాటలోని ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా ఉంది. వాంచినాథన్ మురుగేశన్ తన కెమెరాతో బంధించిన ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. నివాస్ కె ప్రసన్న అందించిన మ్యూజిక్ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంది. ఇక దివ్యాంశ కౌశిక్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పాటకు మరింత ఎనర్జీ తీసుకొచ్చారు. కథానాయిక స్వభావాన్ని, సమాజం పట్ల ఆమెకున్న అభిప్రాయాన్ని తెలిపేలా ఈ పాట సాగింది. కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ క్యాచీ గానూ, అర్థవంతంగానూ ఉన్నాయి. నిరంజనా రామన్ ఎంతో జోష్ తో పాటను ఆలపించారు. ఆమె గాత్రం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. మొత్తానికి ఈ 'కయ్యాలే' సాంగ్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.
ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఎడిటర్ గా జీఏ గౌతమ్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె వ్యవహరిస్తున్నారు.