ఏదైనా మా సినిమా అనేది కుటుంబం. కొన్ని సమస్యలుంటాయి. అవన్నీ పరిష్కరించుకుంటామని కూడా తెలిపారు. అలాగే పేర్నినాని ఇంటికి వచ్చినప్పుడు కొందరు మీడియా వారు తప్పుగా రాసేశారు. నాకు అన్ని పార్టీలవారితో ఫ్రెండ్స్ వున్నారు. బొత్స సత్యనారాయణగారి ఇంటిలో పెండ్లికి నాన్నగారు వచ్చారు. అప్పుడు పేర్ని నాని తెలుసుకుని మా ఇంటికి రమ్మన్నారు. ఈ సందర్భంగా పలు చర్చలు జరిగాయి. కానీ కొందరు మీడియా థ్యాంక్స్ అనే పదాన్ని ట్వీట్‌లో పెడితే రకరకాలుగా మార్చేసి, రాద్దాంతం చేశారు. నేను జగన్‌గారితో చర్చించిన విషయాలు నా వ్యక్తిగతం అయినవే.
తిరుపతిలో స్టూడియో కడతా
ఫైనల్‌గా సినిమా అనేది ఒకే కుటుంబం. మా అధ్యక్షుడిగా జగన్‌గారిని మూడో సారి కలిశాను. ఇవాళే కాదు అని తేల్చిచెప్పారు. తిరుపతిలో స్టూడియోలు కడతాను. ఫిలింకోర్సులు మొదలుపెడతాను అన్నారు.