ఇదిలా వుండగా, దసరాలోని పాటలకు, యాక్షన్‌కు ఆడియన్స్ పేపర్లు చింపి విసిరేయడం చూసిన మా వాడు ఏమన్నాడో తెలుసా.. వీల్ళు ఎందుకు ఇలా అరుస్తున్నారు. పేపర్లు అనవసరంగా చింపుతున్నారు. చాలా వేస్ట్ చేస్తున్నారంటూ బాధ పడ్డాడు. ఎందుకంటే వాడు ఇంటిలో హోం వర్క్ కోసం పేపర్లో రాసేవాడు గనుక అది గుర్తుకువచ్చి అలా అన్నాడు. 6సంవత్సరాలున్నాయి. ఇంకా వాడికి నా గురించి ఏమీ తెలీదు. షూటింగ్ ముందు నుంచి గెడ్డం జుట్టు పెంచాను. రోజూ ఉదయమే వెళతాడు. రాత్రివస్తాడు. ఏమిటి అని అడిగేవాడు. ఈ సినిమా చూశాక.. దీనికోసం ఇలా రోజూ వెళుతున్నాడనేది వాడికి అర్థమైందని.. నాని తెలిపారు. ఇంకో మూడేళ్ళయితే వాడికి అన్ని అర్థమవుతాయి. మెచ్యూర్డ్ అవుతాడని తన కొడుకు గురించి నాని క్లారిటీ ఇచ్చాడు.