టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చిక్కులో పడింది. సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలపై సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు అనవసరమైన మెడిసన్స్ జోలికి వెళ్లకుండా.. నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ (పీల్చడం) చేస్తే.. మ్యాజిక్‌లా పనిచేస్తుంది అంటూ తను నెబిలైజర్ పెట్టుకున్న ఫోటోను షేర్ చేసింది.
అయితే సైంటిఫిక్ సొసైటి ది ఆస్మా అండ్ అలర్జీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆరోగ్యానికి ప్రమాదమని, నెబ్యులైజ్ చేయద్దని, ప్రజలను హెచ్చరించింది. ఆమెకు సాయం అవసరం.. అలాగే మెరుగైన సలహాదారుడు అవసరం అంటూ ఎక్స్ వేదికగా ఓ వైద్యుడు ట్వీట్ చేశారు. శ్వాసకోశ వైరల్ ఇన్ ఫెక్షన్లను నివారించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడమని చెబుతుండటం.. బుద్ది తక్కువ పని అంటూ వైద్యుడు మండిపడ్డారు.
సెలబ్రిటీ ముసులో ఇలాంటి సమాచారాన్ని అందిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నసమంతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమెను జైలులో పెట్టాలన్నాడు దీనిపై సమంత స్పందిస్తూ తనను జైలులో పెట్టిన పర్లేదని.. సదరు వైద్యుడికి తనకంటే ఎక్కువ తెలిసినా.. తను అనుసరిస్తున్న వైద్య విధానాల్ని మాత్రమే సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నానని.. డబ్బుల కోసం ఈ పని చేయటం లేదని క్లారిటీ ఇచ్చింది.