వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

ఐవీఆర్

గురువారం, 4 జులై 2024 (23:11 IST)
భారత్ లో దాదాపు 70 మిలియన్ల మంది ప్రజలను వెర్టిగో ప్రభావితం చేస్తోంది. తరచుగా ప్రజలు అంతగా పట్టించుకోని బ్యాలెన్స్ డిజార్డర్ అయిన వెర్టిగో గురించి చాటిచెప్పడానికి అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ అగ్రగామి అయిన అబాట్ భారత్‌లో తన 'చక్కర్‌కో చెక్ కర్' ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రపంచం తమ చుట్టూ తిరుగుతున్నట్లు ప్రజలు భావించే పరిస్థితే వెర్టిగో. ఈ ప్రచారం ద్వారా, ప్రజలు తమ ఆరోగ్యాన్ని నియంత్రించుకోవడంలో, పరిస్థితిని మెరుగ్గా నిర్వహించడంలో సహాయపడాలని అబాట్ లక్ష్యంగా పెట్టుకుంది.
 
వెర్టిగో గురించిన వాస్తవాలను ప్రపంచానికి అందించడానికి, అబాట్ ఒక డిజిటల్ ఫిల్మ్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో బాలీవుడ్ నటుడు,  యునిసెఫ్ ఇండియా ప్రచారకర్త ఆయుష్మాన్ ఖురానా ఉన్నారు. వెర్టిగో ఆకస్మిక స్పిన్నింగ్ ఎపిసోడ్‌లు జీవితాన్ని ఎలా అసమతుల్యం చేస్తాయనే దాని గురించి ఇది స్పష్ట మైన చిత్రాన్ని అందిస్తుంది. వెర్టిగోతో జీవించే వారు తమ ఆరోగ్య సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతుంది.
 
వెర్టిగోతో తన వ్యక్తిగత అనుభవాలను ఆయుష్మాన్ ఖురానా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘వెర్టిగోతో వ్యవహరించడం ఒక సవాలుగా ఉండింది, కానీ అది నాకు తట్టుకునే శక్తిని నేర్పింది. నాకు వెర్టిగో ఉన్నట్లు 2016లో నిర్ధారణ అయింది. ప్రతి ఆకస్మిక కదలిక కూడా ప్రపంచాన్ని నా చుట్టూ తిప్పేలా చేసే అనుభూతి కలిగేది. బిజీ సినిమా షెడ్యూల్‌ల మధ్య, రాబోయే డిజ్జి స్పెల్ గురించి నిరంతరం భయం భయంగా ఉండేది. అయితే, సరైన మందులను కనుగొనడం, ధ్యానంలో నిమగ్నం కావడం వంటివి నా పరిస్థితిని నిర్వ హించుకోవడంలో నాకు సహాయపడ్డాయి. ఈ పరిస్థితిని నిర్వహించుకోవడం కఠినమైందిగానే అనిపించవచ్చు, అయితే ఇది మీరు గెలవగల యుద్ధం అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. నా ప్రయాణం ఇతరులకు అవసరమైన సహాయాన్ని పొందేందుకు, నూతన విశ్వాసంతో జీవితాన్ని ముందుకు తీసు కెళ్లేందుకు వారిని ప్రేరేపిస్తుందని నేను ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
 
ఆయన అనుభవం అసాధారణం కాదు. లక్షలాది మంది ఈ పరిస్థితిని నిశ్శబ్దంగా అనుభవిస్తున్నారు. సాధారణ చక్కర్‌గా గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని నిర్వహించడానికి, మీ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడానికి సరైన సమయంలో సరైన రోగనిర్ధారణ, చికిత్సను పొందడం, జీవనశైలిలో కీలక మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం.
 
ఈ సందర్భంగా అబాట్ ఇండియా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జెజో కరణ్‌కుమార్ మాట్లాడుతూ, ‘‘సుమారు 70 మిలియన్ల మంది భారతీయులు వెర్టిగోను అనుభవిస్తున్నారు. ఈ బ్యాలెన్స్ డిజార్డర్ ప్రజల జీవన నాణ్యతను ప్రభావితం చేస్తున్నప్పటికీ, దీనిని సమర్థంగా నిర్వహించుకోవచ్చు. వెర్టిగోతో జీవించే వ్యక్తుల ప్రయాణాన్ని సులభతరం చేయడం ద్వారా అవగాహన పెంచడం ద్వారా, పరిస్థితి సంకేతాలను గుర్తించడంలో సహాయపడే జ్ఞానం, సాధనాలతో వారికి సాధికారత కల్పించడం, సకాలంలో వైద్య సలహా, మద్దతు పొందడం ద్వారా, సంతృప్తికరమైన జీవితాలను గడిపేలా చేయడాన్ని అబాట్ తన లక్ష్యంగా పెట్టుకుంది’’ అని అన్నారు.
 
IQVIA సహకారంతో అబాట్ నిర్వహించిన సర్వే ఈ ప్రచారంలో అంతర్భాగంగా ఉంది. భారతదేశంలో వెర్టిగోతో జీవిస్తున్న వ్యక్తుల వాస్తవికతలను అర్థం చేసుకోవడానికి ఈ సర్వే ఫలితాలు సహాయపడతాయి. ఈ సర్వే ముంబై, దిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో 1,250 మంది అభిప్రాయాలతో నిర్వహించబడింది. వీరిలో వెర్టిగో రోగులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు, మైకముతో బాధపడుతూ ఇంకా పరిస్థితి నిర్ధారణ కాని వారు కూడా ఉన్నారు.
 
వెర్టిగో: ఒక ముఖ్యమైన పోరాటం
తలనొప్పులు, రెండుగా కనిపించడం, లోకం చీకటిగా మారుతున్న అనుభూతిని కలిగించే, నియంత్రణ లేని విధంగా కళ్లు తిరిగే ప్రపంచాన్ని ఊహించుకోండి. వెర్టిగోతో జీవించే వారికి మాత్రం ఇది వాస్తవం. అబాట్ మరియు IQVIA సర్వే ఈ పరిస్థితి ప్రజల జీవితాలను, వ్యక్తిగతంగా, వారి చుట్టూ ఉన్న వ్యక్తులపై కూడా ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై వెలుగులు ప్రసరింపచేస్తుంది.
 
వ్యక్తిగత జీవితం: వెర్టిగో కేవలం స్పిన్నింగ్‌కు మాత్రమే కారణం కాదు. ఇది వ్యక్తిగత జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. 34% మంది ముఖ్యమైన సంఘటనలను రద్దు చేసుకుంటారు, 33% మంది తరచుగా కోపంతో చికాకు పడుతున్నారు. 26% మంది కుటుంబ సభ్యులతో తమ సంబంధాలు దెబ్బ తింటాయేమోననే భయంతో ఉన్నారు.
 
ట్రిగ్గర్లు: వెర్టిగో ప్రధాన ట్రిగ్గర్లు ఆందోళన లేదా ఒత్తిడి (39%), ప్రయాణం (34%), వాతావరణంలో మార్పులు (30%).
 
లక్షణాలు: ప్రతి వెర్టిగో ఎపిసోడ్ తలనొప్పి(52%), డబుల్ విజన్(43%), బ్లాక్ అవుట్ ఫీలింగ్(40%), తలలో భారం (37%), మెడ నొప్పి (28%) సహా అనేక రకాల లక్షణాలను కలిగిస్తుంది.
 
కుటుంబ జీవితం మరియు ప్రయాణం: వెర్టిగో వారి కుటుంబాన్ని చూసుకునే రోగుల సామర్థ్యాలను ప్రభావితం (23%) చేస్తుంది. కుటుంబ నాణ్యత సమయాన్ని (23%) తగ్గిస్తుంది. ఇది ప్రజా రవాణా లేదా విమాన ప్రయాణాన్ని(19%) ఉపయోగిస్తున్నప్పుడు కూడా అసౌకర్యాన్ని సృష్టిస్తుంది.
 
దాని ప్రభావాలు ఉన్నప్పటికీ, మైకం ఉన్నదని చెప్పే వ్యక్తులలో 48% మంది మాత్రమే లక్షణాల కోసం పరీక్షించబడతారు. సగటున, వెర్టిగో 38 సంవత్సరాల వయస్సులో నిర్ధారణ చేయబడుతుంది. దాదాపు నాల్గవ వంతు మంది రోగులు నెలకు ఒకసారి దీని అటాక్‌ను ఎదుర్కొంటారు. వెర్టిగో గురించి కొన్ని అపోహలు కొనసాగుతున్నాయి. 21% మంది రోగులు ఈ పరిస్థితి వృద్ధులను మాత్రమే ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు.  15% మంది దీనికి చికిత్స చేయలేమని, అంటువ్యాధి అని నమ్ముతున్నారు. తమ వ్యక్తిగత జీవితాలపై చాలా ప్రభావం ఉన్నప్పటికీ, వెర్టిగో రోగులలో సగం మంది మాత్రమే మందులు తీసుకుంటున్నారు. వెర్టిగో ఎపిసోడ్ వచ్చే అవకాశాలను తగ్గించడానికి వాహనాలలో ప్రయాణించడాన్ని (34%) మానేస్తున్నారు. స్క్రీన్ సమయాన్ని (30%) తగ్గిస్తున్నారు. ఈ డేటా అంతా కూడా వెర్టిగోతో నివసించే వారు చేస్తున్న రహస్య పోరాటాల స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు