నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ సినిమాను సంవత్సరం పాటు రిలీజ్ చేయకుండాఉంచుకున్నాం. ఇలాంటి ఫీలింగ్ కోసమే రెండేళ్లు మా దగ్గరే పెట్టుకున్నాం. ఇప్పుడు థ్యాంకింగ్ ప్రోగ్రాం పెట్టొద్దని అనుదీప్ అన్నాడు. రాహుల్, దర్శి, రధన్, ఫరియా కొన్ని సినిమాలు అలా కలిసి వస్తాయ్. నవీన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలు చేసినా వాటికి తగ్గట్టు ఉంటాడు. ఏజెంట్ పాత్ర చేస్తే ఏజెంట్‌లా జోగిపేట కుర్రాడిలా ఇలా ఏ పాత్ర చేసినా అలానే కనిపిస్తాడు. విజయ్ కూడా అంతే.. ఒకే నాణెనికి రెండు వైపులున్నట్టు ఉంటారు. ఈవెంట్‌కు వచ్చినందుకు థ్యాంక్స్ విజయ్. ఏసీపీ జితేందర్ గారికి ధన్యవాదాలు. ఇంత పెద్ద ఈవెంట్‌ను జాగ్రత్తగా నిర్వహించినందుకు థ్యాంక్స్ అని ఆయనకు శానిటైజ్డె బొకేను అందించారు. ఇక డైరెక్షన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ సినిమా కోసం పని చేసిన వారందరి గురించి నాగ్ అశ్విన్ వివరించారు.