ఇక్కడున్న వారంతా నా ఫ్రెండ్స్. నా జీవితంతో ఏదో ఒకలా ప్రతీ ఒక్కరూ ముడిపడి ఉన్నారు.. కలిసి కలలు కన్నాం. కష్టాలు చెప్పుకున్నాం. నవ్వించారు.. ధైర్యమిచ్చారు. వంద వంద వేసుకుని తిన్నాం. తాగాం. దర్శిలేకపోతే పెళ్లి చూపుల్లో ప్రశాంత్ లేడురా. దర్శి ఇప్పుడు అన్ని ఫ్లాట్‌ఫాంలో చేస్తున్నాడు. ప్రతీ రోజూ బిజీగా ఉంటున్నాడు. శివ లేకపోతే అర్జున్ లేడు. రాహుల్ రామకృష్ణను నటుడిగా నిన్ను ఎప్పుడూ గౌరవిస్తాను. ఆరేళ్ల క్రితం నువ్ హీరోగా నిలబడుతావ్ మన ముందు ఓ 25 వేల మంది ఉంటారు. మనం మాట్లాడతామని అనుకుంటే నవ్వుకునేవాళ్లం. కానీ ఇంటికెళ్లి ఇదే కలలు కనేవాళ్లం. పడుకునే వాళ్లం కాదు. మేం అంతా కలిసి థియేటర్ చేసే వాళ్లం. నేను నవీన్ ఒక గ్రూపులో దర్శి, రాహుల్ మరో గ్రూపులో కలిసి నటించేవాళ్లు. ఆరేళ్ల క్రితం కూడా ఇదే టాలెంట్ ఉంది. టైం ఇప్పుడు వచ్చింది. ఇక్కడున్నాం. గుర్తుండిపోయే జర్నీ ఇస్తాం.