Hari Damera, Nagraju Thalluri, C Kalyan, Maruti, VN Aditya
భారతీయతకు బలమైన పునాది మన సంస్కృతి, సంప్రదాయాలు. వాటిని కాపాడుకుంటూ నవ్యతను జోడించుకుంటూ మన సంస్కృతిని ముందు తరాలకు అందించాలనే ఆకాంక్షతో మీడియా హౌస్ మొదలు పెట్టారు. అదే 'ఎపిక్టైజ్స. మీడియా హౌస్ తో పాటు వెబ్ సైట్ కూడా ప్రారంభం అయింది. హరి దామెర, నాగరాజు తాళ్లూరి ఇద్దరు కలిసి మొదలు పెట్టిన అద్భుత కార్యక్రమం 'ఎపిక్టైజ్' మీడియా. ఈ మీడియా లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో శుక్రవారం జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, దర్శకుడు మారుతి, దర్శకుడు వి ఎన్ ఆదిత్య, రాజ్ మాదిరాజు తదితరులు పాల్గొన్నారు. 'ఎపిక్టైజ్ మీడియా సంస్థ' తన తొలి కార్యక్రమంగా 'రాగరస... రీగరీసా' అనే కార్యక్రమాన్ని నిర్విహిస్తోంది. శ్రీమతి మణి నాగరాజు దీనిని రూపకల్పన చేశారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య, త్యాగరాజు, పురందర దాసు, మీరా భజన్స్, మొదలైన కీర్తనలకు ఆధునిక వాద్యపరికరాలతో సప్తస్వరాలను జోడించి సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ.. తర్వాతి తరాలకు అందించే బాధ్యతలో రూపుదిద్దుకన్న ప్రోగ్రామే ఈ 'రాగరస'... దేశంలో సంగీత సామ్రాజ్యంలో పేరు ప్రఖ్యాతులు గడించిన విద్యాంసులను, గానాలాపనచేసే ప్రావీణ్యులను ఓ వేదికపైకి తెచ్చే కార్యక్రమమే 'రాగరస' !!