పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఆలోచింపజేసే కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ చిత్రాలకు సినిమాటొగ్రాఫర్‌గా పనిచేసిన శ్యామ్ తుమ్మలపల్లి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. మొదటి సన్నివేశానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల క్లాప్ కొట్టగా మాగంటి గోపీనాథ్ కెమెరా స్విచాన్ చేశారు.
హీరో శ్రీ విష్ణు, దర్శకుడు వీఎన్ ఆదిత్య స్క్రిప్టును మేకర్స్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత వివేక్ కూచిబొట్ల హాజరయ్యారు. డిసెంబరు చివరి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.
సాంకేతిక వర్గం: దర్శకత్వం: శ్యామ్ తుమ్మలపల్లి, నిర్మాత: జె. ప్రవీణ్ రెడ్డి, సంగీతం: గౌర హరి, సినిమాటోగ్రఫీ: కేశవ, కథ: కిషోర్ శ్రీ కృష్ణ, ఎడిటర్: జెస్విన్ ప్రభు, కో-ప్రొడ్యూసర్: చైతన్య కందుల, సుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామబాలాజి. డి.