కొత్త ఏడాది కారు కొనాలనుకునే వారికి షాక్.. ఎందుకంటే?

గురువారం, 2 డిశెంబరు 2021 (17:33 IST)
కొత్త ఏడాది కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగబోతున్నాయి. కానీ కార్ల ధరలు ఎంత మేర పెరుగుతాయనే విషయం ఇంకా తెలియరాలేదు.  
 
చిప్ కొరత కారణంగా సెమీ కండక్టర్స్ ధరలు పెరిగిపోయాయి. దీంతో కార్ల కంపెనీలపై ఒత్తిడి నెలకొంది. అందుకే కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. 
 
అంతేకాకుండా మరోవైపు స్టీల్, అల్యూమినియం వంటి పలు ముడిపదార్ధాల ధరలు కూడా పెరిగాయి. దీంతో కార్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగాయి. అందుకే మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి రేట్ల పెంపు అమలులోకి వస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు