దగ్గుబాటి అభిరామ్‌కి పెళ్లి.. డిసెంబర్ 6న శ్రీలంకలో డుం. డుం. డుం.
సోమవారం, 4 డిశెంబరు 2023 (18:25 IST)
సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి జరగబోతోంది. ఈ నెలలోనే ఈ పెళ్లి జరగనుంది. పెళ్లికూతురు కూడా దగ్గర బంధువే.
వధువు పేరు ప్రత్యూష. శ్రీలంకలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు వివాహ వేడుక జరగనుంది. ఇది డెస్టినేషన్ వివాహం కావడం గమనార్హం. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మెహందీ వేడుక ఉంటుంది.
ఈ పెళ్లికి దాదాపు 200కు పైగా అతిథులు హాజరుకానున్నట్టు సమాచారం. సినిమాల విషయానికి వస్తే... హీరోగా ఆయన తొలి సినిమా 'అహింస' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.