హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీకి కరోనా పాజిటివ్

గురువారం, 24 సెప్టెంబరు 2020 (12:30 IST)
Swetha Tiwary
సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు పేదధనిక వర్గాల తేడా లేకుండా కరోనా కాటేస్తోంది. అలాగే దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో కేసుల సంఖ్య 56లక్షలు దాటిపోయింది.

సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హిందీ సీరియల్ 'మేరే డాడ్ కీ దుల్హన్' నటి శ్వేతా తివారీకి కరోనా పాజిటివ్ వచ్చింది. 
 
ఈ విషయాన్ని నటి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు ఈ నెల 16 నుండి కరోనా లక్షణాలు ఉన్నాయని టెస్ట్ చేసుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపింది.

దాంతో వచ్చేనెల 1వ తేదీ వరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉంటానని ప్రకటించింది. ప్రస్తుతం తనకు టఫ్ టైం నడుస్తుందని పేర్కొంది. తనకు కరోనా పాజిటివ్ రావడంతో తనను కాంటాక్ట్ అయ్యిన వారు కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు