''గ్రీకు వీరుడు'' అంటే నాగార్జున నటించిన సినిమా కాదు.. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ హీరోగా దాసరి దర్శకత్వంలో వచ్చిన ''గ్రీకు వీరుడు'' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత సిసింద్రీ సినిమాల్లో నాగార్జునకు జోడీగా అతిథి పాత్రలో కనిపించింది. నాగార్జునతో కలిసి నటించిన హల్లో పిల్లా అనే సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మధ్య కొరియాగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా ''ఏబిసిడి 2" సినిమాలో చేసి హాట్ హాట్‌గా అలరించింది. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిన ఈ నలభై ఏళ్ల సుందరి మళ్ళి సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది.