తమిళనాడులోని రాజకీయ పార్టీలు, నేతలు ఈ వెబ్ సీరిస్ ను బ్యాన్ చేయాలని కోరినా కేంద్రం మాత్రం మౌనం వహించింది. దాంతో మరికొన్ని గంటల్లో ఈ వెబ్ సీరిస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదే విషయాన్ని మేకర్స్ సైతం సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
తమ వెబ్ సీరిస్ ట్రైలర్ లోనొ కొన్ని సన్నివేశాలను చూసి, అపోహలకు గురి కావద్దన్నది వారి మాట. ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేసిన వారిలో అత్యధిక శాతం మంది తమిళులే ఉన్నారని, ప్రధాన పాత్రలు పోషించిన ప్రియమణి, సమంత, రచయిత సుమన్ కూడా ఆ ప్రాంతం వారేనని, వారికి తమిళ సంస్కృతి, సంప్రదాయాలంటే అపారమైన గౌరవం ఉందని, కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ తమిళలను అవమానించడం అనేది తమ వెబ్ సీరిస్‌లో జరగదని హామీ ఇస్తున్నారు. ఇక సమంత ఫ్యాన్స్ ఆమెకు మద్దతిస్తున్నారు.