మిల్కీ బ్యూటీని అలా వర్ణిస్తూ మెసేజ్‌లు పంపిన అభిమానులు

బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (21:07 IST)
అగ్ర హీరోయిన్లలో ఒకరిగా మిల్కీ బ్యూటీ తమన్నా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. అటు సినిమాల్లో నటిస్తూ ఇటు ప్రత్యేక గీతాల్లోను కనిపిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో ముందుకు దూసుకుపోతోంది. ప్రేక్షకులకు మాత్రం దూరం కాకుండా జాగ్రత్త పడుతోంది. అగ్ర హీరోయిన్ అయిన నువ్వు ప్రత్యేక గీతాలు నటించడం ఏంటి అని స్నేహితులు అడిగితే మిల్కీ బ్యూటీ ఇలా చెప్పిందట.
 
నన్ను హీరోయిన్ గాను, ఐటెం సాంగ్ గర్ల్ గాను ఆదరిస్తున్నారు. ప్రేక్షకులకు నా డ్యాన్స్ బాగా నచ్చుతుంది. ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో వేలమంది ప్రేక్షకులు పంపిన మెసేజ్‌లను నేను చదివాను. మీ డ్యాన్స్ అద్భుతంగా ఉంటుంది.. చాలా బాగా డ్యాన్స్ చేస్తారు అంటూ సందేశాలు పంపారు. అందుకే నేను ఒకవైపు సినిమాలు చేస్తూ మరో వైపు ప్రత్యేక గీతాల్లో నటిస్తున్నాను. అలా నటిస్తే తప్పేంటి అంటోంది తమన్నా. నా ఇష్టం వచ్చినట్లు నేను నటిస్తానంటోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు