లైంగిక ఆరోపణలు : బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌పై కేసు

బుధవారం, 23 సెప్టెంబరు 2020 (16:25 IST)
లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై కేసు నమోదైంది. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ముంబైలోని వెర్సోవా పోలీసులు వెల్లడించారు. 
 
ఏడేళ్ళ క్రితం తనపై అనురాగ్ కశ్యప్ లైంగిక దాడికి యత్నించాడంటూ బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. గత 2013లో వెర్సోవాలోని యారి రోడ్‌లో అనురాగ్ కాశ్యప్ తనపై లైంగిక దాడి చేశాడని పాయల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
దీంతో ఆయనపై వెర్సోవా పోలీస్ స్టేషనులో కేసు నమోదైంద. ఈ కేసులో అనురాగ్ కాశ్యప్ ను విచారిస్తామని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా, లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ బాలీవుడ్ దర్శకుడికి అనేక మంది సినీ సెలెబ్రిటీలు మద్దతు తెలుపుతూ పాయల్ ఘోష్‌పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు