తెలంగాణలోని ఏటూరు నాగారం లో పుట్టి పెరిగిన విజయశాంతి, ఆ టైంలో రజాకార్ల ఉద్యమం ఉద్రుతంగా వుండగా మా తాతగారు చెన్నై వెళ్ళిపోయారు. 36 మంది మా కుటుంబీలం. మా తాత గారు వెయ్యి ఎకరాల భూమిని వదులుకొని వచ్చేశారు అని తెలిపింది.
నా జీవితంలో అన్నీ చిత్రాలే జరిగాయి. నటిగా పీక్ స్టేజీకి వెళతానని అనుకోలేదు. హీరోలు 25, 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకునే రోజుల్లో నాకు కోటి ఇవ్వడం దేవుడు నన్ను నడిపించాడని భావిస్తున్నా. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. మా తల్లి తెలంగాణ పార్టీ పెట్టాను. సేవ చేయాలనుకున్నా. కానీ రాజకీయాల్లో చాలా ఎదురుదెబ్బలు వుంటాయని తెలిసింది. అందుకే కొంతకాలం దూరంగా వున్నానని చెప్పారు.