మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ‘గల్లీ రౌడీ’ ట్రైలర్
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (19:19 IST)
Chiranjeevi, Gully Rowdy team
కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత సినిమా థియేటర్స్‌లో చాలా సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులను నవ్వించాయి. అయితే మేం ఏకంగా నవ్వులతో సెప్టెంబర్ 17న దాడి చేయబోతున్నాం అని అంటున్నారు గల్లీరౌడీ అండ్ టీమ్. హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కోన వెంకట్ సమర్పకుడిగా వ్యవహిరించడమే కాకుండా స్క్రీన్‌ప్లే అందించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించారు.
పక్కా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా అన్ని ఎలిమెంట్స్ ఉన్న విందుభోజనంలా ప్రేక్షకులను సంతోషపెట్టడానికి సెప్టెంబర్ 17న మీ దగ్గరున్న థియేటర్స్‌లో గల్లీరౌడీ సందడి మొదలు కానుంది. ఈ నవ్వుల సందడికి శాంపిల్ ఎలా ఉంటుందో చూపించడానికి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
Chiranjeevi, Gully Rowdy team
ట్రైలర్ లో ఏముందంటే!
నీకు తెలిసిన రౌడీ ఎవరైనా ఉన్నారా? అని వైవా హర్షను హీరోయిన్ అడిగితే నా ఫ్రెండే పెద్ద రౌడీ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది.
సందీప్ కిషన్ పరిచయం ఓ రేంజ్‌లో ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. అదే హీరోయిన్ ఇతను నిజంగానే రౌడీనా? అని ప్రశ్నిస్తే.. రోజూ పులిగోరు అవీ ఇవీ పెడతావు కదా అవెక్కడ అంటూ వైవాహర్ష ప్రశ్నించడం దానికి బదులుగా సందీప్ మొదటిసారి కాఫీషాప్‌కు వస్తున్నా కదా, కాస్త క్లాస్‌గా ఉందామని అని బదులిస్తాడు. దానికి రివర్స్‌గా వైవా హర్ష ఏసుకోరా రౌడీ అంటే ఎవరూ నమ్మట్లేదు అని చెప్పే డైలాగ్‌తోనే హీరో క్యారెక్టర్ ఏంటి? తను ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నాడనే విషయం రివీల్ అవుతుంది.
హీరోయిన్ నేహాశెట్టి ప్రేమలో హీరో ఆమె వెంటపడటం..
వాడు రౌడీ.. వాళ్ల నాన్న రౌడీ... వాళ్ల తాత రౌడీ.. అంటూ హీరో గురించి హీరోయిన్ బిల్డప్ ఇవ్వడం రౌడీలను సందీప్ కిషన్ చితక్కొట్టడం
పోలీసులు నాపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తే నాకు పాస్‌పోర్ట్ కూడా రాదు కదా.. అని సందీప్ కిషన్ అంటే ఒక్క పాస్ పోర్ట్ ఏంటి? రేషన్ కార్డ్ కూడా రాదు అంటూ వైవా హర్ష చెప్పే డైలాగ్ వింటే హీరోకి రౌడీ కావడం కంటే బయట దేశాలకు వెళ్లాలనే డ్రీమ్ ఉండటం. కానీ ప్రేమ కోసం రౌడీ మారుతాడనే సంగతి అర్థమవుతుంది.
బాబీ సింహ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. తను రౌడీలను ఎన్‌కౌంటర్ చేయడం
కామెడీ కోణంలో సాగే రాజేంద్ర ప్రసాద్, సహా ప్రతి పాత్ర ఎంటర్‌టైనింగ్‌లోనే సాగుతుంది
ట్రైలర్‌లోనే ఈ రేంజ్ కామెడీ ఉంటే, ఇక సినిమా ఎలా ఉండబోతుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లో క్రియేట్ చేసేలా ట్రైలర్ ఆసక్తికరంగా, ఎంటర్‌టైనింగ్‌గా కనిపిస్తుంది. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు.