ఓటీటీలో పలు మాధ్యమాలు వున్నా 'సోని లివ్' ఓటీటీ చాలా త్వరగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుందని `వివాహ భోజనంబు`సినిమాను విడుదల చేస్తున్నామని నటుడు, చిత్ర నిర్మాతల్లో ఒకరైన సందీప్ కిషన్ తెలియజేశారు. ఈ నెల 27న "వివాహ భోజనంబు" 'సోని లివ్' ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కమెడియన్ సత్య హీరోగా నటించగా..ఆర్జావీ రాజ్ నాయికగా కనిపించనుంది. ఈ సినిమా గురించి సందీప్ కిషన్ జూమ్ మీటింగ్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.