chiru-garikapati-datrateya
దసరా సందర్భంగా అలయ్‌బలయ్ అనే కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఆథ్యాత్మిక వేత్తలు, సాహితీ వేత్తలు అంతా ఒకే వేదికపై వచ్చారు. దీనిని గవర్నర్ దత్తాత్రేయ ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకలో చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ, నేను వెళ్ళిపోతాను. నాకు మొహమాటం లేదని వ్యాఖ్యానించడం పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై వెంటనే నాగబాబు రియాక్ట్ అయ్యారు. దాంతో తెలుగు సినిమారంగం చిరంజీవి సపోర్ట్‌గా నిలిచింది. మరోవైపు అభిమాన సంఘాలు నేరుగా గరికపాటికి ఫోన్ చేసి వివరణ అడిగాయి.