పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈకామర్స్ కంపెనీలు వివిధ రకాలైన ఆఫర్లతో పాటు ఫెస్టివల్ సేల్స్‌ను ప్రకటిస్తున్నాయి. అమెజాన్ సంస్థ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో ఓ బిగ్ సేలే ప్రకటించగా, మరో ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట ఫ్లిప్‌కార్టే సేల్స్ ప్రకటించింది.
అయితే, అమెజాన్ ప్రకటించిన ఫెస్టివల్ సేల్ ఇప్పటికీ కొనసాగుతుండగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్ సెప్టెంబర్ 30తో ముగిసింది. ఈ క్రమంలోనే మరో సేల్‌తో ఫ్లిప్‌కార్ట్ ముందుకొచ్చింది. 'బిగ్ దసరా సేల్' పేరిట అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజులపాటు సేల్ నిర్వహించనుంది.
బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను మిస్ అయిన వారు ఈ బిగ్ దసరా సేల్‌లో తమకు ఇష్టమైన వస్తుసామాగ్రితోపాటు దుస్తులను కొనుగోలు చేయొచ్చు. కాగా, మొన్నటి సేల్స్‌లో యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. ఈ సారి హెచ్‌డీఎఫ్‌సీతో జట్టుకట్టింది.
క్రెడిట్, డెబిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తామని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందే ఈ సేల్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. అంటే 3వ తేదీ అర్థరాత్రి నుంచే వీరు సేల్‌లో పాల్గొనవచ్చు.
అయితే, ఈ సేల్‌లో ప్రకటించే ఆఫర్ల వివరాలు తెలియరానప్పటికీ.. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ఫ్రిజ్, టీవీలపై డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉంది. 'బిగ్ బిలియన్ డేస్' ఉన్న ఆఫర్లే దాదాపు ఉండే అవకాశం ఉంది. మొన్నటి సేల్స్‌లో ఔట్ ఆఫ్ స్టాక్ లేదా ఇతర కారణాల వల్ల సేల్‌లో పాల్గొనలేకపోయిన వారు ఈ సేల్‌ను పరిశీలించొచ్చు.