`భ‌ళా తంద‌నాన` చిత్రంలో గ‌రుడ‌రామ్ లుక్

బుధవారం, 7 జులై 2021 (12:47 IST)
Garuda ram
టాలీవుడ్‌లో అతి త‌క్కువ మంది నటులు మాత్రమే అసాధారణమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ విభిన్న క‌థా చిత్రాల‌లో న‌టిస్తుంటారు వారిలో శ్రీ‌విష్ణు ఒక‌రు. ప్ర‌స్తుతం `బాణం` ఫేమ్ చైతన్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు హీరోగా న‌టిస్తోన్న చిత్రం `భ‌ళా తంద‌నాన‌`. ఈ చిత్రంలో శ్రీ విష్ణుని ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని ఒక స‌రికొత్త అవ‌తారంలో ప్ర‌జెంట్ చేయ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు చైత‌న్య‌.
 
ప్ర‌ముఖ నిర్మాణ‌సంస్థ వారాహి చ‌ల‌న‌చిత్రం ప‌తాకంపై సాయి కొర్ర‌పాటి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు స‌ర‌స‌న కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో కేజీఎఫ్ ఫేమ్ గ‌రుడ రామ్ మెయిన్‌విల‌న్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం భ‌ళా తంద‌నాన చిత్రీకర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.
 
ఈ రోజు గ‌రుడ‌రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అతని లుక్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ మూవీలో ఆనంద్‌బాలి అనే  ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అతని లుక్, క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్, టైమింగ్ అన్నీ ఈ సినిమాలో భిన్నంగా ఉండ‌బోతున్నాయి అని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో అతను పొడవాటి జుట్టు మరియు గుబురైన‌ గడ్డంతో  ప‌ర్‌ఫెక్ట్ మెయిన్ విల‌న్ ని త‌ల‌పిస్తున్నాడు.
 
ఐదు పాట‌లు ఉన్న ఈ చిత్రానికి మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌కుడు. సురేష్ ర‌గుతు సినిమాటోగ్రాఫ‌ర్‌, శ్రీ‌కాంత్ విస్సా రైట‌ర్‌, మార్తాండ్ కె వెంక‌టేష్ ఎడిట‌ర్‌, గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ డైరెక్ట‌ర్.
 
నిర్మాత - ర‌జని కొర్ర‌పాటి, స‌మ‌ర్ప‌ణ - సాయి కొర్ర‌పాటి, సంగీతం - మ‌ణిశర్మ‌, ఎడిట‌ర్ - మార్తాండ్  కె వెంక‌టేష్‌, కెమెరాః సురేష్ ర‌గ‌తు, ఆర్ట్ - గాంధీ న‌డికుడిక‌ర్‌, ర‌చ‌యితః శ్రీ కాంత్ విస్సా.
 

వెబ్దునియా పై చదవండి