దీనిపై ఆయన మరోమారు వివవరణ ఇచ్చారు. "ఆ రోజు నేను.. జీవిత.. ప్రవీణ్ సత్తారు కూర్చుని 'గరుడవేగ' ప్రమోషన్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను చేసిన సూచనలు జీవితకి నచ్చకపోవడంతో నాకు కోపం వచ్చేసింది. దాంతో చెన్నైకి వెళ్లిపోదామనే ఉద్దేశంతో కారు తీసుకుని ఎయిర్ పోర్టుకు వెళ్లాను. ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని వెనుదిరిగాను" అన్నారు.
ఒక చోట నేను కారు ఆపగా.. ఆ వ్యక్తి తన కారును తీసుకొచ్చి నా కారు ముందు ఆపాడు. నేను కారు తీస్తుండగా .. ఆయన కారుకు తగిలింది. నేను వేసుకున్న నిద్రమాత్ర పనిచేస్తుండటం వలన.. కారు బ్రేక్ సరిలేనందుకు అలా జరిగింది. అంతేగానీ .. నిజంగానే నేను తాగలేదు.. ఆ విషయం పోలీసులు చేసిన టెస్టులోను తేలింది" అని వివరణ ఇచ్చారు.
కాగా, రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన "పీఎస్వీ గరుడవేగ" చిత్రం ఇటీవల విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించడమే కాకుండా, కాసుల వర్షం కురిపించింది. దీంతో ఆ ప్రమాదం గురించి ప్రతి ఒక్కరూ మరిచిపోయారు. కానీ, ఎలక్ట్రానిక్‌తో పాటు సోషల్ మీడియాలో ఈ వార్త పదేపదే ప్రసారమవుతుండటంతో రాజశేఖర్ మరోమారు వివరణ ఇచ్చారు.