గవి సినిమాస్ & సిల్లీ మాంక్స్ స్టూడియోస్ బేనర్‌పై నూతనంగా నిర్మిస్తున్న చిత్రాన్ని తెలంగాణలోని నల్గొండ జిల్లా, చిన్నమాదారం గ్రామంలో ప్రారంబించారు. నల్గొండ ఎమ్మెల్యే శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి & నాగార్జున సాగర్ ఎమ్మెల్యే శ్రీ నోముల భగత్ తో పాటు నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి ఈరోజు ప్రారంభమైన షూటింగ్ మహోత్సవానికి హాజరయ్యారు.
ఈ చిత్రానికి RG గండికోట దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం చరణ్ అర్జున్ మరియు ప్రవీణ్ కె బంగారి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో విఘ్నేష్ రెడ్డి మరియు శ్రీ హర్షితలు హీరో, హీరొయిన్లుగా పరిచయం అవుతున్నారు. కోకొండ జయచందర్ రెడ్డి, సంజయ్ రెడ్డి మరియు అనిల్ పల్లాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 2022 నెలలో విడుదల చేసేందుకు తాత్కాలికంగా ప్లాన్ చేస్తున్నారు.
సిల్లీ మాంక్స్ స్టూడియోస్ లిమిటెడ్ సౌత్ఇండియా అంతటా భారీ సినిమా మరియు సిరీస్ ల లైన్ అప్ కలిగి ఉంది. కంపెనీ ఉద్దేశం కొత్త కథలను ప్రోత్సహించడం,అభివృద్ధి చేయడం, సినిమా మరియు సిరీస్ ప్రాజెక్ట్ లను సెటప్ చేయడం,పెట్టుబడిదారులు మరియు సినిమా సృష్టికర్త మధ్య వారధిగా పని చేయడం మరియు సినిమా వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడం. 9 సంవత్సరాలకు పైగా ట్రాక్ రికార్డు కలిగి వుండి స్క్రిప్ట్ డెవలప్మెంట్,మార్కెటింగ్ మరియు సినిమా మార్కెటింగ్, ప్రొడక్షన్ మరియు విక్రయాలను సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ చూసుకుంటుంది.