యాక్షన్ థ్రిల్లర్ గా తెరెక్కుతున్న ఘోస్ట్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే మైసూర్ లో పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో బెంగళూరు లో వేసిన మరో భారీ సెట్ లో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యుల్ లో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సన్నివేశాలతో పాటూ నాలుగు యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తారు. దీంతో ఫిబ్రవరి లోనే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ప్రముఖ ఆడియో కంపెనీ ఆనంద్ ఆడియో ఘోస్ట్ మ్యూజిక్ రైట్స్ ను రికార్డ్ ప్రైస్ కి కైవసం చేసుకుంది. అన్నీ భాషల ఆడియో హక్కులను ఆనంద్ ఆడియో సొంతం చేసుకోవడం విశేషం.
ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఘోస్ట్ లో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఘోస్ట్ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కె జి ఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నిషన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ఘోస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
డైరెక్టర్ : శ్రీని (బీర్బల్)
కెమెరా మాన్ : మహేంద్ర సింహ
సంగీతం : అర్జున్ జన్య
ఆర్ట్ : శివ కుమార్ (కె జి ఎఫ్)
డైలాగ్స్: మస్తీ, ప్రసన్న వి ఎం
ఆడియో: ఆనంద్ ఆడియో,
పబ్లిసిటీ, పి ఆర్ ఓ: బిఏ రాజుస్ టీం