అన్ని G అనే అక్షరంతో స్టార్ట్ అయిన సినిమాలే చేస్తున్నా : అంజలి

డీవీ

సోమవారం, 8 ఏప్రియల్ 2024 (18:44 IST)
Anjali
నాకు ఉగాది పండుగ అంటే చాలా ఇష్టం. ఈ ఉగాదికి గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. హారర్, కామెడీ సహా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆడియెన్ గా హారర్ మూవీస్ ను బాగా ఎంజాయ్ చేస్తాను. తర్వాత మర్డర్ మిస్టరీ సినిమాలను చూడటానికి ఇష్టపడతాను అని నటి అంజలి తెలిపింది. 
 
ఈ చిత్రాన్ని శివ తుర్లపాటి దర్శతక్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. అంజలికి ఇది 50వ చిత్రం.దీంతో ఈ చిత్రం ఆమెకు ప్రత్యేకంగా మారింది.  హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రాన్ని  ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ ....అదేంటో అన్ని G అనే అక్షరంతో స్టార్ట్ అయిన సినిమాలే చేస్తున్నా. అందులో ముందుగా ‘గీతాంజలి మళ్ళీవచ్చింది’ రిలీజ్ అవుతుంది. అలాగే గేమ్ ఛేంజర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు రాబోతున్నాయి. అయితే మూడు సినిమాలు జోనర్స్ పరంగా డిఫరెంట్ గా ఉంటాయి.
 
* గేమ్ ఛేంజర్ సినిమాను అన్నింటి కంటే ముందే స్టార్ట్ చేశాం. కానీ ఆలస్యమైంది. గీతాంజలి మళ్ళీవచ్చింది సినిమాను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కంటే ఆలస్యంగా స్టార్ట్ చేసినప్పటికీ ఇదే ముందుగా రిలీజ్ అవుతుంది. మూడు సినిమాల్లో నా పాత్రలు వేటికవే భిన్నంగా ఉంటాయి.
 
* ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా పాయింట్ ను కోన వెంకట్ గారు నాలుగేళ్ల ముందే చెప్పారు. అయితే అప్పుడు నేను బిజీగా ఉండటం, తర్వాత ఈ సినిమాలో ఇతర నటీనటులు బిజీగా ఉండటంతో కుదరలేదు. మధ్యలో కరోనా కూడా వచ్చింది. అయితే సీక్వెల్ చేయాలనేది ఇప్పటిది కాదు.
 
* ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’..ఇదొక సీక్వెల్ కాబట్టి పాత క్యారెక్టర్స్ ను మార్చలేం. కాబట్టి కొత్త క్యారెక్టర్స్ ను స్టోరీలోకి తీసుకొచ్చాం. అలీగారు, సునీల్ గారు, సత్య.. పార్ట్ 1 ఎక్కడ ముగిసిదో సీక్వెల్ అక్కడ నుంచి మొదలవుతుంది. పార్ట్ వన్ చూడని వాళ్లకు కూడా సీక్వెల్ అర్థమవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు