ఓ బోయపాటి శీను, ఓ త్రివిక్రమ్ శీను, ఓ వైట్ల శీను, సెనక్కాయల శీను.. అంటూ శీనివాస్ రెడ్డి తన గురించి చెప్పుకుంటూ.. ఓ సీన్ చేయడానికి కెమెరా్ మెన్ సునీల్ తోపాటు నటీనటులు సత్య, అంజలి తదితరులతను పాడుపడిన బంగ్లాలోకి తీసుకెళ్ళి షూట్ చేస్తారు. అక్కడ వింతవ్యక్తులు కనిపిస్తే... వీరంతా మెథడ్ యాక్టర్స్ అంటూ శీనివాస్ రెడ్డి సర్ది చెబుతాడు.
ఇలా హారర్, వినోదంతోకూడిన ట్రైలర్ లో శీనివాసరెడ్డి, కోన వెంకట్ హైలైట్ అయ్యేలా సంభాషణలు వున్నాయి. ఇక నటీనటుల నటన వినోదాన్ని పండిస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11 న విడుదల చేయనున్నారు.
చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ, గీతాంజలి సినిమా చేసే సమయానికి నేను 45 సినిమాలకు వర్క్ చేసి ఉన్నాను. కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనిపించి చేసిన సినిమాయే గీతాంజలి. శ్రీనివాస్ రెడ్డి నా దగ్గరకు రాజ్ కిరణ్‌ని తీసుకొచ్చాడు. హారర్ మూవీగా ఉన్న ఆ కథను కామెడీ హారర్‌గా మార్చాను. సీక్వెల్ రావటానికి పదేళ్లు పట్టింది. గీతాంజలి 2ను అమెరికాలో చేద్దామని అనుకున్నాను. కానీ టెక్నికల్, ప్రాక్టికల్ అంశాల కారణంగా సినిమాను ఊటీకి మార్చి చేశాం. సత్య, సునీల్, రవిక్రిష్ట, రాహుల్ మాధవ్, అలీ సినిమాకు అడిషన్స్ అయ్యారు. సినిమాను ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే ఆడియెన్స్ చూడటానికి వస్తారో దాన్ని మించి ఎంజాయ్ చేస్తారు అన్నారు.