ఈరోజు, శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా, ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి యాక్షన్-ప్యాక్డ్ గ్లింప్స్ తో ఈ చిత్రం టైటిల్ 'మదరాసి'ని రివిల్ చేశారు మేకర్స్. శివకార్తికేయన్ పూర్తిగా పవర్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. ఈ గ్లింప్స్ సినిమాలోని ఇతర కీలక పాత్రలను కూడ పరిచయం చేస్తుంది.
హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు ఇది మొదటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, అరుణ్ వెంజరమూడు ఆర్ట్ డైరెక్టర్. యాక్షన్ కొరియోగ్రఫీని కెవిన్ మాస్టర్, దిలీప్ మాస్టర్ పర్యవేక్షిస్తారు.