దువ్వాడ జగన్నాథమ్ రెండో సాంగ్ రిలీజ్.. అల్లు అర్జున్ డ్యాన్స్.. పూజాహెగ్డేతో రొమాన్స్ కేక..

మంగళవారం, 30 మే 2017 (14:55 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న దువ్వాడ జగన్నాథమ్ సినిమా రెండో పాటను ఆన్ లైన్లో విడుదల చేశారు. ఈ పాటకు నెటిజన్ల మధ్య మంచి క్రేజ్ లభిస్తుంది. దేవి శ్రీ సంగీతం మ్యూజిక్ ల‌వ‌ర్స్ కి మంచి కిక్ ఇస్తుంది. ఈ సాంగ్‌లో పూజా హెగ్డేతో బ‌న్నీ రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉంది. ఇక అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ పాటలోని అల్లు అర్జున్ స్టెప్పులు ఫ్యాన్స్‌ని గాల్లో తేలియాడేలా చేస్తున్నాయ‌ట. 
 
విజువ‌ల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. జూన్ 23న ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఈ చిత్రం యాక్ష‌న్ ప్యాక్డ్ మూవీగా రూపొందుతుంది. దిల్ రాజు బేన‌ర్ పై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతుంది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్న డీజే షూటింగ్ ఇప్పటికే ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం విడుదలైన డీజే రెండో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసిన 24గంటల్లో 1,958,863 మంది వీక్షించారు. వీరిలో 58,437 లైక్ చేయగా, 12,178 మంది డిస్‌లైక్ కొట్టారు. ఈ పాటను మీరూ ఓ లుక్కేయండి.

 

వెబ్దునియా పై చదవండి