ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. రీసెంట్‌గా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకణ పూర్తయ్యింది. అదే యుఫోరిక్ ఎనర్జీతో మేకర్స్ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్‌డేట్ ఇస్తూ సెట్స్ నుంచి ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఎవర్‌గ్రీన్ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సెట్స్‌లో మనకు కనిపించారు. ఆమె మేకప్ వేసుకోవటం, షూటింగ్‌లో పాల్గొనటం వంటి సన్నివేశాలను మనం ఆ వీడియోలో చూడొచ్చు. ఆమె రాకతో ఆ సెట్స్‌కు మరింత ఉత్సాహం వచ్చింది.
ఇంకా ఈ చిత్రంలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లికితా యలమంచిలి, అడ్డాల పృథ్వీరాజ్, కల్పలత, సాయిశ్రీనికా రెడ్డి, ఆశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ రెడ్డి, లికిత్ నాయుడు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.