తెలుగు చిత్రపరిశ్రమలోకి 'దేశముదురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ హన్సిక మోత్వాని. ఆమె సోమవారం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటుంది. చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ భామ... వచ్చిన పలు సినిమాలు చేసింది. కానీ, ప్రస్తుతం తగిన ఆఫర్స్ అందుకోలేకపోయింది.
వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లేతో హన్సిక ఇప్పటివరకు తన కెరియర్లో పోషించనటువంటి సరికొత్త పాత్రలో సస్సెన్స్ థ్రిల్లర్ ఉంటుందట. ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది చిత్ర కథాంశం. ఇది ప్రేక్షకులకి మంచి అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ అంటున్నారు.
ఈ రోజు హన్సిక బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో హన్సిక సీరియస్ లుక్‌లో ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మురళీశర్మ, జయప్రకాష్, ఆడుకాలం నరెన్, రాజా రవీంద్ర తదితరులు ఈ సినిమాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్క్.కె.రాబిన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.