పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

ఠాగూర్

మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (14:29 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఓ శుభవార్త చెప్పారు. తన నిర్మాణంలో పవన్ హీరోగా తెలకెక్కుతున్న "హరి హర వీరమల్లు" చిత్రం మార్చి 28వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన మిగిలిన షూటింగ్‌కు అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎవరికీ ఎటువంటి ఆందోళన అక్కర్లేదు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తాం. పవన్‌కు సంబంధించిన మిగిలిన షూటింగ్‌ను కూడా పూర్తి చేస్తున్నాం అని తెలిపారు. 
 
ఇకపోతే, ఈ నెల 14వ తేదీన చిత్ర బృందం కీలక అప్‌డేట్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా రెండో సింగిల్ కొల్లగొట్టిందిరో అంటూ సాగే రొమాంటిక్ పాటను ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం 4 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
దీంతో పాటు ఈ పాట కోసం పవన్ ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇపుడు నిర్మాత మూవీ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించడంతో జనసేనాన్ని అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం, ఆనందం నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు