ఈ ఉల్కకి 2024 YR4 అనే పేరు కూడా పెట్టేశారు. ఈ ఉల్క ప్రస్తుత స్థానాన్ని బట్టి ప్రమాద పటాన్ని నాసాకు చెందిన శాస్త్రవేత్త డేవిడ్ రాంకిన్ అనే ఇంజనీర్ సిద్ధం చేశారు. దీనిని బట్టి భారతదేశంపై ఈ ఉల్క పడే అవకాశం వుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఉల్క ప్రభావం భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇథియోపియా, సూడాన్, నైజీరియా, కొలంబియా, ఈక్వెడార్ వంటి దేశాలపై వుండే అవకాశం వుంది.
2032లో ఈ 2024 YR4 ఉల్క భూమిని ఢీకొడితే ఆఫ్రికా ఖండంలోకి ప్రాంతాలు, ఉత్తర, దక్షిణ అమెరికా నుంచి ఫసిఫిక్ సముద్రంపై ప్రభావం వుంటుంది. డిసెంబర్ 22, 2032న ఈ ఉల్క భూమిని ఢీకొట్టే అవకాశం వుందని నాసా అంచనా వేస్తుంది. సముద్రంలోనే ఈ ఉల్క పడినా.. జనావాస ప్రాంతాల్లో ఎక్కడైనా పడితే మాత్రం భారీ విధ్వంసం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఉల్క ప్రభావం 500 అణుబాంబులకు సమానం. ఇంకా 8 మెగాటన్నుల టీఎన్టీ పేలిన శక్తి విడుదలవుతుంది. ఇది హీరోషిమా మీద వేసిన అణుబాంబు కంటే 500 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. దీనిని 2024 డిసెంబరులో గుర్తించారు.