Rajendra Prasad, Divi, Sriram, TG Vishwaprasad
డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ "హరికథ" అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మ్యాగీ "హరికథ" సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి "హరికథ" వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు "హరికథ" సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.