బిగ్ బాస్ హోస్ట్‌గా సమంత సక్సెస్ అయ్యిందా..? లేదా..?

మంగళవారం, 27 అక్టోబరు 2020 (12:42 IST)
బుల్లితెర పై రియాల్టీ షో అంటే అందరూ చెప్పే పేరు బిగ్ బాస్. ఈ షో రికార్డు స్థాయి రేటింగ్‌తో దూసుకెళుతూ.. ఇండియాలోనే నెంబర్ 1 ఛానల్‌గా నిలిచింది. దీనికి కారణం బిగ్ బాసే. ఇదిలా ఉంటే... బిగ్ బాస్ 4కి హోస్ట్‌గా ఉన్న టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా కులుమనాలిలో షూటింగ్ జరుపుకుంటుంది.
 
నూతన దర్శకుడు సోల్మాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. నాగ్ కులుమనాలి వెళ్లడంతో బిగ్ బాస్ హోస్ట్‌గా సమంతకి ఛాన్స్ ఇచ్చారు. దీంతో సమంత హోస్ట్‌గా ఎలా చేస్తుందనే క్యూరియాసిటీ ఏర్పడింది.
 
సమంత తనదైన స్టైల్లో నవ్వుతూ... నవ్విస్తూ... బాగానే ఆకట్టుకుంది. అయితే.. తెలుగు భాషపై పట్టు లేకపోవడంతో అక్కడక్కడా తడబడింది. ఈ విషయం తనకు ముందే తెలుసు కాబట్టి.. తెలుగులో మాట్లాడటంలో కాస్త తడబడితే ఏమీ అనుకోవద్దు క్షమించేయండి అంటూ ముందే చెప్పేసింది.
 
ఆమె చాలా ఎమోషనల్‍ అని రియాక్షన్స్ లోనే తెలిసిపోయింది. కంటెస్టెంట్లు ఏడుస్తుంటే సమంత కళ్లు కూడా చెమర్చాయి. బిగ్‍బాస్‍ హోస్ట్ ఇంత ఎమోషనల్‍గా వుంటే కుదరదు. అవసరం అనుకున్నప్పుడు గట్టిగా క్లాసులు పీకుతుండాలి.
 
ఇక అసలు విషయానికి వస్తే.. సమంత బిగ్ బాస్ హోస్ట్‌గా సక్సస్ సాధించిందా..? లేదా అంటే... చాలా మంది చెప్పేది ఏంటంటే.. హోస్ట్‌గా బాగానే చేసింది కానీ.. ఓ అదరగొట్టింది అనేలా చేయలేదు. ఇంకా బాగా చేసుండాల్సింది అనే మాట వినిపిస్తుంది.
 
ఇదిలావుంటే సమంత ఈ కార్యక్రమానికి హోస్టుగా వచ్చినందుకు సుమారు 2 కోట్ల పారితోషికం తీసుకున్నదంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి నిజంగా అంత పారితోషికం ఇచ్చి వుంటారా అనేది డౌటే. ఏముందిలో... ఏదో ఒక వార్త రాసి పడేస్తే పోలా అని అనుకునేవారు ఎవరైనా ఇది క్రియేట్ చేసి వుండొచ్చని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వచ్చే వారం కూడా సమంతనే హోస్ట్. మరి.. వచ్చే వారం ఏం చేస్తుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు