హెబ్బాకు 'ముగ్గురు బాయ్‌ ఫ్రెండ్స్‌'...

శనివారం, 5 నవంబరు 2016 (19:36 IST)
కుమారి ఎఫ్‌21 చిత్ర ఫేమ్‌ హెబ్బాపటేల్‌.. ఆ చిత్రంలో యూత్‌ను ఎట్రాక్ట్‌ చేసింది. హీరోతో లిప్‌ కిస్‌లిచ్చి హాట్‌హాట్‌గా మార్చిన ఆ చిత్రం సక్సెస్‌ అయింది. మరలా రెండో చిత్రంగా ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్‌ను ఎంచుకుంది. ఇందులో ముగ్గురు ఆమె చుట్టూ పడతారు. వారిలో ఒకరిని అత్తకకు అల్లుడుగా మామకు యముడిగా నాకు లవర్‌గా సెలక్ట్‌ చేసుకుంటానంటూ.. డైలాగ్‌ చెబుతుంది. ఈ డైలాగ్‌తోపాటు టీజర్‌ను శనివారంనాడు హైదరాబాద్‌లో విడుదల చేశారు. 
 
సహజంగా ఒకరు బాయ్‌ఫ్రెండ్‌ వుంటే ఓకే. కానీ ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్‌ అంటే వినడానికి ఎలాగో వున్నా.. తనకు మాత్రం థ్రిల్‌ కలుగుతుందని హెబ్బా చెబుతోంది. ఆ ముగ్గురుని సిటీనుంచి తన ఊరికి తీసుకువచ్చి వారిలో ఒకరిని స్వయం ప్రకటిస్తుందన్నమాట. అదెలా అనేది వచ్చేనెలకు ఆగాల్సిందేనని చెబుతోంది. ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్‌ (గోపి) నిర్మిస్తున్నారు.
 
చిత్రం 'నాన్న, నేను నా బాయ్‌ ఫ్రెండ్స్‌'. భాస్కర్‌ బండి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రావు రమేశ్‌, హెబ్బా పటేల్‌, తేజస్వి మడివాడ, అశ్విన్‌ బాబు, పార్వతీశం, నోయల్‌‌సేన్‌ ప్రధాన తారాగణం. చిత్రం టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో వి.వి.వినాయక్‌ విడుదల చేశారు.

వెబ్దునియా పై చదవండి