రామ్ హుషారుకు, ఎనర్జీకి లిమిట్స్ ఉండవు. బోయపాటి శ్రీను సినిమాల్లో భారీతనానికి కూడా లిమిట్స్ ఉండవు. వీళ్ళిద్దరూ కలిస్తే... మ్యాగ్జిమమ్ ఉంటుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థండర్. సినిమా ఏ స్థాయిలో ఉంటుందనే హింట్ ఇచ్చారు.
ఆల్రెడీ ఫస్ట్ థండర్‌లో ''నీ స్టేటు దాటలేనన్నావ్... దాటా! నీ గేటు దాటలేనన్నావ్...దాటా! నీ పవర్ దాటలేనన్నావ్... దాటా! ఇంకేంటి దాటేది... నా బొంగులో లిమిట్స్!'' అంటూ రామ్ చెప్పిన డైలాగ్ పాపులర్ అయ్యింది. లిమిట్స్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాలో యూత్ ఈ డైలాగ్ చెబుతున్నారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతానికి ప్రశంసలు లభిస్తున్నాయి. హీరో పేరు (రాపో - రామ్ పోతినేని) పేరు వచ్చేలా కంపోజ్ చేసిన బీజీఎమ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. యంగ్ హీరోల్లో హీరో పేరు మీద ఈ స్థాయిలో మాస్ బీజీఎమ్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పాలి.
త్వరలో సినిమా టైటిల్, ఇతర వివరాలు వెల్లడించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం: ఎస్ థమన్, డీవోపీ: సంతోష్ డిటాకే, ఎడిటింగ్: తమ్మిరాజు.