మలయాళంలో ఇప్పటికే పలు టీవీ సీరియల్స్‌లో నటించిన సినీనటి అతిథి అలియాస్ అథిరా సంతోష్
తమిళంలో 'నెదునల్వాడై' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేమిస్తున్నాననంటూ దర్శకుడు సెల్వకణ్ణన్ తన వెంటపడి వేధించాడని ఆరోపించింది. అంతేగాకుండా సెప్టెంబర్ 28న విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ఆమె కోలుకుంది.
తనను చంపుతానని బెదిరించాడని వాపోయింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని, తాను అంగీకరించకపోవడంతో చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది. అతడి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించినట్లు మీడియాతో తెలిపింది.