తేజ, వరలక్ష్మీ గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. తేజ చాలా మంచి నటుడు. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే వరలక్ష్మీ గారితో కలసి పని చేయడం కూడా మంచి అనుభూతి. ఆమె నుంచి కూడా కొన్ని మెళకువలు నేర్చుకున్నాను. సెట్ లో అందరినీ పరిశీలిస్తాను. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవానికి ఎదో ఒక విషయం వుంటుంది. హనుమాన్ వెరీ మెమరబుల్ జర్నీ. ఈ జర్నీలో సహనంగా వుండటం నేర్చుకున్నాను. ఒక ఆర్టిస్ట్ కి సహనం చాలా ముఖ్యం.