పోర్న్ సినిమాల్లో నటించాలంటే మెడికల్ రిపోర్టులు తప్పనిసరి. ప్రస్తుతం లిప్ లాక్‌లకు కూడా మెడికల్ రిపోర్టులు ప్రొడ్యూస్ చేసేలా కొత్త రూల్ వర్తింపజేసే ఆలోచనలో ఉత్తరాది, దక్షిణాది సినీ ఇండస్ట్రీలు యోచిస్తున్నాయి. ఇందుకు నాందిగా దక్షిణాదిన ఓ టాప్ హీరోయిన్ లిప్ లాక్ చేయాలంటే హీరోగారి మెడికల్ రిపోర్టులు ఉండాల్సిందేనని పట్టుబట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఓ తమిళ సినిమా షూటింగ్ సందర్భంగా ఈ షాకింగ్ సంఘటన జరిగిందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
లిప్ లాక్ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే సదరు ఆరోగ్య విషయంలో కొన్ని డౌట్స్ ఉండటంతో మెడికల్ రిపోర్టులు చూపించాలని అసిస్టెంట్ డైరక్టర్ని అడిగిందట ఆ హీరోయిన్. నోటి ద్వారా హిపటైటిస్-బి లాంటి ప్రమాదకర జబ్బు సోకే ప్రమాదం ఉండటంతో ఆమె ఇలా మెడికల్ రిపోర్టులు అడిగిందట. హీరోయిన్ డిమాండ్‌తో అసిస్టెంట్ డైరెక్టర్ ఈ విషయాన్ని దర్శకుడికి చెప్పాడట.
ఇదిలా ఉంటే.. వైద్యులు గమనించిన విషయాల ప్రకారం, ఇండస్ట్రీలోని చాలా మందికి లివర్‌కి సంబంధించిన వ్యాధులతో ఉన్నారని.. కొన్ని వైరస్‌లో వారికి తెలియకుండానే రక్తంలోనూ, లాలాజలంలోనూ ప్రవేశిస్తున్నాయి. వీటిపై జాగ్రత్తలు తీసుకోకపోతే, హీరోహీరోయిన్స్ మధ్య జరిగే చుంభన సన్నివేశాల్లో ఒకరికి ఉన్న వైరస్ మరొకరికి వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని వైద్యులు అంటున్నారు. అయితే లిప్ లాక్ చేయాలంటే మెడికల్ రిపోర్టు అడిగిన హీరోయిన్ పేరు మాత్రం బయటికి రాలేదు.