ఈ సీజన్‌లో బలమైన కంటెస్టెంట్‌గా ఉన్న శివాజీపై పోరాడి గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. 14 వారాల పాటు ఇంట్లోనే ఉన్న శోభ.. ఇంటికి వెళ్లేటప్పుడు ఎంత తీసుకుందో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శోభాశెట్టి రెండున్నర లక్షల రూపాయల రెమ్యూనరేషన్‌తో ఇంట్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆమె 14 వారాలకు గాను దాదాపు 35 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది.
శోభ ఎలిమినేషన్‌తో, శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, అర్జున్, ప్రియాంక హౌస్‌లో పోటీదారులుగా మిగిలిపోయారు. మరి టైటిల్ ఎవరు గెలుస్తారో చూడాలి.