వైకాపా నేతను బెదిరించిన కేసులో బండ్ల గణేశ్ అరెస్టు

బుధవారం, 23 అక్టోబరు 2019 (19:38 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వైకాపా నేత, సినీ నిర్మాత పీవీపీ వరప్రసాద్‌ను బెదిరించిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. 
 
ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన్ని పిలిచిన పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. అదేసమయంలో, గతంలో ఆయనపై నమోదైన కేసులను కూడా పోలీసులు విచారించినట్టు సమాచారం. బండ్ల గణేశ్‌పై 420, 448 తదితర ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
కాగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమా కోసం బండ్ల గణేశ్‌కు పీవీపీ రూ.30 కోట్లు ఫైనాన్స్ చేశారు. తీసుకున్న డబ్బులో రూ.7 కోట్లు తిరిగి చెల్లించలేదు. ఈ విషయమై వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పీవీపీని బండ్ల గణేశ్ బెదిరించినట్టు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు