ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అక్కినేనిని నేనే అంటున్న సుమంత్

శనివారం, 4 ఆగస్టు 2018 (15:40 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌ను ద‌గ్గుబాటి రానా పోషిస్తోన్నట్టు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌ను క‌న్ఫ‌ర్మ్ చేస్తూ క్రిష్ ట్వీట్ చేసారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో అక్కినేని పాత్ర గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. 
 
అక్కినేని పాత్ర‌ను నాగచైత‌న్య చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఆత‌ర్వాత నాగచైత‌న్య కాదు.. సుమంత్ చేస్తున్నాడ‌ని టాక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఎవ‌రో కొత్త ఆర్టిస్ట్ అక్కినేని పోషించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఈ ప్ర‌చారాల‌కు ఫుల్‌స్టాఫ్ పెడుతూ... ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అక్కినేని పాత్ర‌ను పోషిస్తున్న‌ట్టు సుమంత్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసాడు. చైతు అక్కినేనిగా న‌టిస్తే ఎలా ఉంటుందో చూసాం. ఇక సుమంత్ అక్కినేనిగా ఎలా ఉంటారో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు