నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ నిర్మిస్తుండడం విశేషం. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇటీవల బాలయ్య, విద్యాబాలన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలాఉంటే... ఎన్టీఆర్, బసవతారకాన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారట.
ఈ విషయాన్ని ఈ సినిమాలో చూపించనున్నారట. వారిద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలిసింది. అయితే.. ఈ లవ్ స్టోరీ బసవతారకం పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుందట. మూడు నెలల్లో టాకీ కంప్లీట్ చేసేలా క్రిష్ ప్లాన్ చేసారట. ఇప్పటికే స్వరవాణి కీరవాణి ట్యూన్స్ రెడీ చేసారని... చాలా బాగా వచ్చాయని బాలయ్య మెచ్చుకున్నారట. అలాగే ఈ సినిమాకి సాయిమాధవ్ బుర్రా మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. జనవరి 9న ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.