#MeToo అన్నందుకు ఒక్క ఛాన్స్ లేకుండా గోళ్లు గిల్లుకుంటున్న స్టార్ హీరోయిన్

సోమవారం, 12 నవంబరు 2018 (11:38 IST)
మీటూ అంటే మాటలు కాదు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ఎవరి పేరు చెబుతుందోనన్న ఉత్కంఠ రేగుతోంది. ముఖ్యంగా మీటూ ఓ ఉద్యమంలా సినీ ఇండస్ట్రీలో సాగుతోంది. చాలామంది హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను విడమర్చి చెపుతున్నారు. ఇప్పటికే చాలామంది మీడియా ముందుకు వచ్చి ఫలానా హీరో వల్ల తను చాలా ఇబ్బందులు పడ్డానంటూ వెల్లడించారు. ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయన్న ఆందోళనలో సినీ ఇండస్ట్రీలో వారు వున్నారు.
 
ఇదిలావుండగా క్యాస్టింగ్ కౌచ్ పైన ప్రశ్నించినందుకు తనకు ఛాన్సులు లేకుండా పోయాయని మలయాళం స్టార్ హీరోయిన్ రమ్య నంబీశన్ బాధపడుతోంది. #MeToo ఉద్యమంలో గళం కలిపినందుకు తనను పక్కన పెట్టేశారనీ, మలయాళం ఇండస్ట్రీలో తనకు ఒక్కరు కూడా అవకాశం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిందామె. ప్రస్తుతం తను తమిళ ఇండస్ట్రీని నమ్ముకున్నానంటూ చెప్పుకొచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు