ప్రస్తుతం జనం రీల్స్ పిచ్చి పట్టి తిరుగుతున్నారు. ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తున్నారు. ప్రాణాలు ప్రమాదంలో పెట్టైనా రీల్స్ తీస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు రీల్స్ తీస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రీల్స్ తీస్తుండగా రైలు ఢీకొని.. యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.