తను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు ఓ బోయ్‌ఫ్రెండ్ వుండేవాడనీ, అతడు తన కేరింగ్ తీసుకునేవాడని చెప్పుకొచ్చారు. అంతేకాదు... ఓ రోజు అతడు అకస్మాత్తుగా తనను లవ్ చేస్తున్నట్లు చెప్పాడట. దానితో ఒకింత షాక్ కు గురయ్యాననీ, ఐతే తేరుకుని తనకు అలాంటి దృష్టి లేదనీ, స్నేహితులుగా వుండిపోదామని చెప్పానని వెల్లడించారు.
ఐతే అతడు అప్పుడు తనతో ఓ మాట అన్నాడనీ, అది ఎప్పటికీ మర్చిపోలేననీ చెప్పిన మాధవీ... ఓ అబ్బాయి ఓ అమ్మాయితో ప్రేమిస్తున్నానని చెప్పాక తిరిగి ఓ ఫ్రెండుగా చూడటం జరగదని చెప్పాడు. అతడు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమేనని నాకనిపించడంతో అతడిని వదిలించుకోవాలనుకుని, అతడి ఇగో దెబ్బతినే మాటలు మాట్లాడి, తన వద్ద నుంచి వెళ్లిపోయేట్లు చేశానని చెప్పుకొచ్చింది మాధవీలత.