మంచు ఫ్యామిలీ ఇప్పుడు చాలా హాట్ టాపిక్. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ పేర్లు వింటేనే సోషల్ మీడియా ఆసక్తినెలకొంటుంది. నిన్న ఏలూరు లో భైవరం ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొన్న మనోజ్, నేను చచ్చేంతవరకు మోహన్ బాబుగారి కొడుకునే అన్నారు. ఇక సోమవారంనాడు ఆయన హైదరాబాద్ లో మీడియాలో మాట్లాడారు. రేపు మనోజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పిచ్చాపాటీ మాట్లాడుతూ, తన తండ్రి నుంచి చాలా నేర్చుకున్నానని, అందులో చాలా మంచి విషయాలున్నాయని పేర్కొన్నారు. నీతి నిజాయితీ, నిబద్ధత, మాటకు కట్టుబడి వుండడం, ముక్కుసూటిగా మాట్లాడడం వంటివి నాకు అలవిన అలవాట్లని చెప్పారు.