రాంచరణ్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి జీవితంలో గెలుపు ఓటములు సహజం. అది ఏరంగంలోనైనా సరే. ముఖ్యంగా క్రీడలలో అది మరింత ముఖ్యం. తాను గుర్రం రేస్‌లలో పాల్గొన్నప్పుడు కూడా ఇదే ఆలోచిస్తాను. అందుకే ఆసక్తి వున్నవారికి గుర్రపు స్వారీ కూడా మా సంస్థ ఆధ్వర్యంలో నేర్పిస్తున్నాను. సినిమా పరంగా పోలీసు కథలు అంటే ఇష్టం. ఇంతకుముందు పోలీస్ పాత్రలు పోషించాను. కోవిడ్ టైంలో వారిపై మరింత ప్రేమకలిగింది. పోలీసులు సైనికుల్లా పనిచేశారు. ప్రజల్ని బయటకు రాకుండా కాపాడారు అని తెలిపారు.
సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ., నాలుగు రోజుల నుండి క్రీడల్లో పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడానికి వచ్చిన సినీ నటుడు రాంచరణ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్ లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే రాంచరణ్ నటించిన మగధీర, ధృవ, రంగస్థలం సినిమాలు చూశాను. చాలా బాగున్నాయి. కోవిడ్ టైంలో ఫేషెంట్లకు ప్లాస్మా ద్వారా 8 వేల మంది ప్రాణాలు కాపాడగలిగాం అని పేర్కొన్నారు.